నవతెలంగాణ – తాడ్వాయి
తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ జంగి ఇందిరా భర్త జంగి రాజయ్య(48) ఆదివారం రాత్రి మృతి చెందాడు ఆయనకు గత 20 రోజుల క్రితం గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ 20 రోజులపాటు చికిత్స పొందాడు ఆయనకు వైద్యులు బైపాస్ సర్జరీ నిర్వహించారు. అయిన ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు రాజయ్య గతంలో గ్రామానికి ఐదు సంవత్సరాల కాలం పాటు సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం రాజయ్య భార్య సర్పంచ్ గా కొనసాగుతున్నారు. ఆయన గ్రామానికి చేసిన సేవలు మరువలేనివని గ్రామస్తులు తెలిపారు. ఆయన మృతి గ్రామానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. మృతునికి భార్య జంగి ఇందిరా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి.