నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని చిన్న గుల్లా సర్పంచ్ శోభా, ఉప సర్పంచ్, వార్డు సబ్యులను గ్రామస్తులు, జీపీ సిబ్బంది అధికారులు శుక్రవారంనాడు సన్మానించారు. ఈ సంధర్భంగా పంచాయతి సెక్రట్రి రమేష్ మాట్లాడుతు సర్పంచ్ గ్రామభివృద్దిలో చేసిన సేవలు ఆమేాఘం అని కొనియాడారు. చిన పంచాయతి అయినప్పడికి సమస్యలు చాలా ఉండేవని ప్రస్తుతం సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయని, రాబోయే రోజులలో నూతనంగా ఎవరు సర్పంచ్ అయిన తాము ఖచ్చితంగా ఆభివృద్ది విషయంలో సహకరిస్తామని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఙ్ఞానేశ్వర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గోన్నారు.