హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ ఓపెన్ కబడ్డీ పోటీల విజేతగా సారు (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) జట్టు నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో శక్తి క్రీడా మండల్‌పై 41-35తో సారు జట్టు మెరుపు విజయం నమోదు చేసింది. రంగారెడ్డి, సూర్యాపేట జట్లు సెమీఫైనల్లో పోరాడి ఓడాయి. తెలంగాణ కబడ్డీ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ విజేతగా నిలిచిన సారు జట్టుకు ట్రోఫీ అందజేశాడు.