– 15 నుంచి సీఎం సుడిగాలి పర్యటనలు
– తొలుత హుస్నాబాద్ నుంచి ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 15 నుంచి ఆయన వివిధ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఆ రోజు ఆయన హుస్నాబాద్‌లో పర్యటిస్తారు. అప్పటి నుంచి ఈనెల 18 వరకు, ఆ తర్వాత 26 నుంచి వచ్చే నెల మూడు వరకు (మధ్యలో ఈనెల 28 మినహా) ఆయన పర్యటనలు కొనసాగనున్నాయి.
పర్యటన వివరాలు…
15.10.23 హుస్నాబాద్
16.10.23 జనగామ, భువనగిరి
17.10.23 సిరిసిల్ల, సిద్ధిపేట
18.10.23 జడ్చర్ల, మేడ్చల్
26.10.23 అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు
27.10.23 పాలేరు, స్టేషన్ ఘన్పూర్
29.10.23 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
30.10.23 జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్
31.10.23 హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
01.11.23 సత్తుపల్లి, ఇల్లందు
02.11.23 నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
03.11.23 భైంసా (ముథోల్)