ఎల్లగిరిలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

Sarvai Papanna Gaud Jayanti in Ellagiriనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఆదివారం  ఘనంగా నిర్వహించారు. సర్వాయి సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు మారగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల రాజ్య స్థాపన కోసం తన ప్రాణాలను అర్పించాడని అన్నాడు. సర్వాయి పాపన్న చరిత్రను మన చరిత్రకారులు విస్మరించారని బ్రిటిష్ చరిత్రను లిఖించారని మారగోని అశోక్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మారగోని జంగయ్య గౌడ్ సంఘ సభ్యులు దేవేందర్ అంజయ్య అంజయ్య శంకరయ్య శ్రీను వెంకటేశం మల్లేష్ దయాకర్ వెంకటేశం శ్రీను అంజయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు.