భూస్వాములకు,పెత్తం దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన సర్వాయి పాపన్న..

Sarvai Papanna who fought against the landlords and Pettham Dari system.– ప్రభుత్వ  విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ వద్ద గల ఆదివారంసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో మునిసిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి,  ప్రభుత్వ  విప్,  వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని  విగ్రహానికి పూలు  వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ పేద,బడుగు బలహీనవర్గాలు పై జరుగుతున్న అన్యాయాల పైన పోరాటం చేసిన మహనీయుడు అని కొనియాడారు.వారి ఆలోచన విధానాన్ని ముదుకు తీసుకపోదాం,ఆనాడు బీసీ బిడ్డ ఎలాంటి అంగ బలం ఆర్థిక బలం లేకున్నా భూస్వాములకు,పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం పోరాటం చేశారు. రాజ్యాధికారం కోసం వారి పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట  జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం అని తెలిపారు.అందరూ ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలి.. వారు పోరాడిన విధానం మార్గదర్శకంగా తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్ ,దూలం భూమేష్ గౌడ్, సీనియర్ న్యాయవాది నేరెళ్ల తిరుమల గౌడ్, తోటలహరి పాత సత్యలక్ష్మి, అంబటి చందు యాదవ్, అరుణ్ తేజ చారి, భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.