నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గౌడ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బహుజన విప్లవ వీరుడు, సర్దార్ పాపన్న బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.