
మనుషుల శరీర అవయవాలలో కళ్ళే చాలా ముఖ్యమని,వాటిని ఎల్లవేళలా కాపాడుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. జిల్లాకోర్టు ఆవరణలోని న్యాయసేవ సదన్ లో శ్రీ చష్మ ఆప్టికల్ సహకారంతో నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. వాతావరణ పరిస్థితులు, పని ఒత్తిడి, శారీరక రుగ్మతల మూలంగా తలెత్తే కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని పేర్కొన్నారు. మానవ శరీరంలో కంటికె చాలా ప్రాముఖ్యమని సర్వేంద్రీయానామ్ నయనం ప్రధానం అనే ప్రాచీన వైద్య సూక్తిని గుర్తు చేస్తు కళ్ళను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. కంటి వైద్యుడు మనోజ్ కుమార్ పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్,న్యాయవాదులు .కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.