భూమిత్రతో సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ భాగస్వామ్యం

హైదరాబాద్‌: బాస్మతి, బాస్మతీయేతర బియ్యం, ఇతర ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ వ్యాపారంలో ఉన్న సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ కొత్తగా భూమిత్ర ఓ2సీ టెక్‌ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. భూమిత్రాతో పర్యావరణ సుస్థిరత, రైతుల ఆర్థిక సాధికారత పద్ధతులను ప్రోత్సహించడం ఉమ్మడి భాగస్వామ్య లక్ష్యమని తెలిపింది. ఉత్పాదకతను పెంచడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌తో అనుసాంధానించబడిన 45,000 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్న 17,000 పైగా రైతులకు మద్దతును అందించనున్నట్లు పేర్కొంది.