కళింగ పర్యటనలో శాట్‌ బృందం

SAT team on Kalinga tourభువనేశ్వర్‌ : తెలంగాణ క్రీడా సంస్థలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని శాట్‌ చైర్మన్‌ కే.శివసేనా రెడ్డి తెలిపారు. శాట్‌ ఎండీ సోనీ బాలాదేవి, కోచ్‌ రవి కుమార్‌తో కలిసి శివసేనారెడ్డి భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్‌ యూనివర్శిటిని సందర్శించారు. అక్కడి మౌళిక సదుపాయాలు, శిక్షణలో అమలు చేస్తున్న పద్దతులు, క్రీడాకారుల ఎంపిక కొలమానాలు సహా పలు అంశాలపై శాట్‌ బృందం పరిశీలించింది. స్పోర్ట్స్‌ యూనివర్శిటి, స్పోర్ట్స్‌ అకాడమీలను ఉన్నత ప్రమాణాలతో మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందిస్తామని శివసేనారెడ్డి అన్నారు.