ఇచ్చిన హామీని  నెరవేర్చాలి: శాతబోయిన రమేష్

నవతెలంగాణ-ధర్మసాగర్
తెలంగాణ రాష్ట్రంలోని యాదవులకు గొర్ల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శాతబోయిన రమేష్  కాడ బోయిన లింగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని గొర్ల కాపర్ల కమ్యూనిటీ హాల్లో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షులు శాతబోయిన రమేష్ అధ్యక్షుడు జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీలో చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ, పంపిణీ చేయకుండా గొర్ల కాపరులు మోసం చేస్తున్నారని ఆరోపించారు.జిల్లాలో రెండో విడత పంపిణీలో జిల్లాలో 7348 మంది లబ్ధిదారులు ఉన్నారని ఇందులో గొర్ల కోసం గత ఐదు నెలల క్రితం 1600 మంది నిరుపేదలైన యాదవులు అప్పులు తెచ్చి డిడిలు కట్టారని గుర్తు అప్పటినుండి ఇప్పటివరకు గొర్ల పంపిణీ చేయకుండా కాలం వెళ్లగొచ్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా గొర్ల పంపిణీ చేయకుండా ప్రభుత్వం గొర్ల కాపరులు మోసం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. యాదవ్ సంఘంలో చదువుకున్న వ్యక్తులు అనేకమంది ఉన్నారని,అలాంటి వారికి  గొర్ల పంపిణీకి బదులు నగదు బదులు చేయాలని డిమాండ్ చేశారు.గొర్లకు మేకలకు సంవత్సరానికి నాలుగు సార్లు నట్టల నివారణ మందులు వేస్తామని ప్రకటించి,నేటికీ ఒక్కసారి కూడా నట్టల నివారణ మందు వేయలేదని అన్నారు.జిల్లాలో ఖాళీగా ఉన్న పశువైద్య పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.గ్రామీణ గొర్ల కాపరుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి జిల్లా ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంటే సమ్మయ్య, వేల్పుల రమేష్, మేకల సాంబరాజు, బండారి రాజ్ కుమార్, నారాయణ, పర్వతాలు, చేరాలు తదితరులు పాల్గొన్నారు.