రెంజల్ మండలం సాటాపూర్ సంత పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఆసియా ఖండంలోని ప్రసిద్ధిగాంచిన సాటాపూర్ సంత గత కరోనా సమయం నుంచి తగ్గు ముఖం పడితే వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వస్తూ ఉండడంతో ఈ సంతలో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ సాఠాపూర్ సంతకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు తమ పశువులను విక్రయించడానికి శుక్రవారం రాత్రి ఇక్కడికి వస్తూ ఉంటారు. వారికి వసతులు కల్పించడంతోపాటు పశువులకు దాహం తీర్చడానికి మరింత పెంచాల్సిన అవసరం ఉంది. వాహనాల నిలుపుకోవడానికి స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు . ఉదయం నుంచి మూడు గంటల వరకు పశువుల సంత కొనసాగుతూ ఉండాగా, మూడు నుంచి సాయంత్రం ఏడు వరకు కూరగాయల సంత అక్కడే కొనసాగుతూ ఉంటుంది. వేలాదిమంది ఈ పశువుల సంతకు వస్తూ ఉండటంతో వారికి మౌలిక సదుపాయాలను కల్పించాలని వారు కోరుతున్నారు.