గుంతల మయంగా మారిన సాటాపూర్ చౌరస్తా..

Satapur Square which has become a pothole..

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం సాటాపూర్ ప్రధాన చౌరస్తా గుంతల మయంగా మారడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని నలుమూలల నుంచి చౌరస్తాకు వందలాదిమంది వస్తూపోతూ ఉంటారు. సాటపూర్ చౌరస్తాలు గుంతలు ఏర్పడి నీరు నిండుకోవడంతో ప్రమాదాలు తప్పడం లేదని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుజల్లులకి గుంతలలో నీరు నిండుకోవడంతో వాహనదారులకు తీవ్రవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంబంధిత శాఖ వెంటనే స్పందించి చౌరస్తాలో ఉన్న గుంతలను పూడ్చివేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.