నవతెలంగాణ – భగత్ నగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణాను బుధవారం సచివాలయంలోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందించాలని విద్యాశాఖ కార్యదర్శిని కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.