డాక్టరేట్ పొందిన సత్యనారాయణకు సన్మానం

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల అద్యాపకులు ఎన్ సత్యనారాయణ డాక్టరేట్ పొందిన సందర్భంగా మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం ఆయనను ఘనంగా మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి పిహెచ్డి  పూర్తి చేసి డాక్టరేట్ పొందిన సత్యనారాయణ అభినందనీయుడని ఆయన అన్నారు. ఈరోజుల్లో ఫిజిక్స్ లో డాక్టరేట్ పొందడం కత్తి మీద సాము వంటిదని ఆయన అన్నారు. అనతి కాలంలోనే  పి ఎచ్ డి పూర్తిచేసి కళాశాలకి భువనగిరికి మంచి పేరు తీసుకు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టరేట్ పట్టా పొందిన సత్యనారాయణ  మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ జనరల్ స్టడీస్ లో తన పరిశోధన పత్రాలను కరోనాకాలంలో కూడా వదిలిపెట్టకుండా పరిశోధన పూర్తి చేశానని, అందుకు సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్ మరియు  అధ్యాపకులు కుటుంబ సభ్యులకు  కృతజ్ఞతలు తెలిపారు.
   ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి రమేష్, అధ్యాపకులు కిష్టయ్య, పి.బాల్ రెడ్డి, ఎన్.సుధా, కనక బాలరాజు, ఆర్.సిద్ది రాములు, ఆర్ రామకృష్ణ, ఎస్ రామకృష్ణ , కళాశాల సిబ్బంది పాల్గొన్నారు