హ్యాట్రిక్‌హిట్‌తో సంతృప్తిగా ఉన్నా..

With a hat-trick Satisfied Even though..‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ ఘన విజయాల తర్వాత…’మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’తో హ్యాట్రిక్‌ సూపర్‌ హిట్‌ అందుకున్నారు హీరో నవీన్‌ పోలిశెట్టి. అనుష్క శెట్టితో కలిసి ఆయన నటించిన క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. ఈ నేపథ్యంలో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సక్సెస్‌ తనకు అందించిన హ్యాపీనెస్‌ గురించి మీడియాతో హీరో నవీన్‌ పోలిశెట్టి మాట్లాడుతూ, ‘మంచి సినిమా అనే వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌తోనే అందరికీ రీచ్‌ అయ్యింది. థర్డ్‌ వీక్‌లో కూడా యూఎస్‌లో రన్‌ అవుతోంది. స్క్రీన్స్‌ పెంచుతున్నారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో కూడా డిమాండ్‌ మేరకు షోస్‌ పెంచుతున్నారు. ఇప్పటిదాకా నాకు దక్కిన మూడు సక్సెస్‌ ఫుల్‌ మూవీస్‌ ఒక్కోటి నా కెరీర్‌కు ఒక్కో రకంగా హెల్ప్‌ చేశాయి. ఈ సినిమాతో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్‌ కూడా చేయగలను అని నిరూపించుకున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. హిందీలోనూ కథలు వింటున్నాను. కపిల్‌ షో లాంటి మంచి హ్యూమరస్‌ టీవీ ప్రోగ్రాం చేయాలని ఉంది’ అని చెప్పారు.