సతీష్ అన్నకే మా మద్దతు..

– దేశానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం
– బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై సతీష్ అన్నకి మా మద్దతు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సైదాపూర్ మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి పుట్ట శ్రీనివాస్, రాయిశెట్టి అజయ్, శ్రీకాంత్, మహేష్, రమేష్ తిరుపతి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్ తో పాటు  50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన కాంగ్రెస్ బీజేపీ పార్టీల యువత బీఆర్ఎస్ పార్టీ లో చేరిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచిందని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు మెట్ట ప్రాంతం మని , ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా మారిందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితులై యువత బీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దినదిన అభివృద్ధి చెందిందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.