
బీఆర్ఎస్ పార్టీ చండూరు పట్టణ అధ్యక్షుడిగా కొత్తపాటి సతీష్ ను నియమిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి చండూరులో మంగళవారం జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించడం పట్ల నియోజవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో పాటు పలువురికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటూ పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.