సతీష్ అన్నకు లక్ష మెజారిటీ పక్కా

– అక్కన్నపేట సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొమ్మగాని రాజేశం..
నవతెలంగాణ-అక్కన్నపేట 
 హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు లక్ష మెజారిటీ పక్కా వస్తుందని అక్కన్నపేట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొమ్మగాని రాజేశం అన్నారు.  మంగళవారం అక్కన్నపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మాపై ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, మాపై అభియోగాలు చేస్తున్నాడని అన్నారు. అక్కన్నపేట మండల సర్పంచులం అంతా కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను  గెలిపించుకొని తీరుతామని తెలిపారు. ఈసారి పక్కా  లక్ష మెజార్టీతో సతీషన్నను  గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.  బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరాయని ఆ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం  విష ప్రచారాలు మానుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 32 గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.