
సర్కారు బడిలోనే సరైన విద్య ఉంటుందని ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షుడు గొరిగే సత్తయ్య అన్నారు. గురువారం గట్టుప్పల మండలం లోని తేరటు పల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, దుస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు పంపి లక్షలు ఖర్చులు పెట్టి పిల్లల భవిష్యత్తును ఆగం చేయొద్దని, ప్రైవేటు పాఠశాలలో అరకొర చదువులు చదివిన ఉపాధ్యాయులతో విద్య నేర్పుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్య బీఈడీ పూర్తి చేసిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, పిల్లలకు సరైన విద్య అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సింగం రేణుక, వెలుగు సిసి అండాలు, ఉపాధ్యాయులు లచ్చిరాం నాయక్, నరసింహ, మల్లేష్, వెంకటేశ్వరరావు రాణి పాల్గొన్నారు.