
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ – చండూరు
కామ్రేడ్ బొడ్డుపల్లి సత్తయ్య సీపీఐ(ఎం) పార్టీ కోసం ఎనలేని కృషి చేశాడని సీపీఐ(ఎం) నల్గొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, అన్నారు. ఆయన అకాల మరణం పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తూ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తయ్య పార్టీ ఏ పని చెప్పినా క్రమశిక్షణగా చేసేవాడని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ముందు పని చేసే వ్యక్తి అలాంటివారు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం, ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటుగా భావించారు. ఆయన ఆశయాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం,బొట్టు శివకుమార్, పగిళ్ళ శ్రీనివాస్, అచ్చిన శ్రీనివాసులు, మలిగే శ్రీశైలం, పగిళ్లబిక్షం, పబ్బు మారయ్య, గిరి నరసింహ, వల్లూరి జంగయ్య, పగిళ్ల చంద్రమౌళి, మధు,వావిల నరసింహ, కట్ట యాదగిరి, కట్టకృష్ణయ్య, బోయపల్లి మల్లయ్య పాల్గొన్నారు.