– ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి డబుల్స్ స్టార్స్ శుభారంభం చేశారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడి తొలి రౌండ్లో వరుస గేముల్లో గెలుపొందారు. 21-13, 24-22తో మలేషియా షట్లర్లపై విజయం సాధించారు. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, గాయత్రి జంట సహచర తనీశ క్రాస్టో, అశ్విని పొన్నప్పలపై పైచేయి సాధించారు. మూడు గేముల హోరాహోరీ మ్యాచ్‌లో 16-21, 21-19, 21-17తో ట్రెసా, గాయత్రి గెలుపొందారు. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ 15-21, 21-15, 21-3తో కెంటా సునేమియా (జపాన్)ను చిత్తు చేశాడు. 8-21, 15-21తో టాప్ సీడ్ విక్టర్ చేతిలో ప్రియాన్షు రజావత్ పరాజయం పాలయ్యాడు.