– మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్
కౌలాలంపూర్: వరల్డ్ నం.9, భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు మలేషియా ఓపెన్ నుంచి నిష్క్రమించారు. ఏడాది తొలి సూపర్ సిరీస్‌లో భారత డబుల్స్ జోడీ నిరాశపరిచింది. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో దక్షిణ కొరియా జోడీ కిమ్, సియో చేతిలో వరుస గేముల్లో పరాజయం పాలైంది. 10-21, 15-21తో సాత్విక్, చిరాగ్‌లు అనూహ్యంగా ఓటమి చెందారు. తొలి గేమ్‌లో 6-11తో వెనుకంజ వేసిన సాత్విక్, చిరాగ్‌లు 19 నిమిషాల్లోనే ప్రత్యర్థికి గేమ్ అప్పగించారు. 10-21తో తొలి గేమ్ చప్పగా ముగిసింది. కీలక రెండో గేమ్‌లో ఏడో సీడ్ భారత జోడీ 11-8తో విరామ సమయానికి ముందంజ వేసింది. కానీ ద్వితీయార్థంలో పొరపాట్లు ఫైనల్లో బెర్త్ కోల్పోయేలా చేశాయి.