– మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్
కౌలాలంపూర్ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ మలేసియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో మలేషియా షట్లర్లపై 26-24, 21-15తో సాత్విక్, చిరాగ్‌లు వరుస గేముల్లో గెలుపొందారు. 50 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో తొలి గేమ్ సూపర్ టైబ్రేకర్‌లో తేలింది. నేడు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియా జోడీ కిమ్, సియోలతో సాత్విక్, చిరాగ్‌లు పోటీపడనున్నారు.