– ఇండోనేషియా మాస్టర్స్ 2025
జకర్తా (ఇండోనేషియా) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఇండోనేసియా మాస్టర్స్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో చైనీస్ తైపీ షట్లర్లు చెన్ జి రారు, లిన్ యు చె జంటపై వరుస గేముల్లో విజయం సాధించారు. 21-16, 21-15తో అలవోకగా గెలుపొందారు. మహిళల సింగిల్స్‌లో తనీశ క్రాస్టో, అశ్విని పొన్నప్పలు 21-6, 21-4తో థారులాండ్ షట్లర్లపై మెరుపు విజయం సాధించారు. మెన్స్ సింగిల్స్ అర్హత రౌండ్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ నిరాశపరిచాడు. 7-21, 15-21తో సహచర భారత షట్లర్ ఆయుశ్ శెట్టి చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్ అర్హత రౌండ్‌లో తాన్య హేమంత్ 16-21, 21-17, 21-15తో మూడు గేముల మ్యాచ్‌లో చైనీస్ తైపీ షట్లర్‌పై గెలుపొంది ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించింది.