కౌలాలంపూర్ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానం కైవసం చేసుకుంది. వరుసగా మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్, చిరాగ్‌లు పురుషుల డబుల్స్ విభాగంలో వరల్డ్ నం.1గా నిలిచారు. మెన్స్ సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు 8వ స్థానంలో నిలువగా.. లక్ష్యసేన్, శ్రీకాంత్, ప్రియాన్షులు వరుసగా 19, 25, 39వ స్థానాల్లో కొనసాగుతున్నారు.