నవతెలంగాణ-జన్నారం
సత్యశోధకు సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో కుల వ్యవస్థ నిర్మూలపై పీడీఎస్‌యూ ఆద్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. సత్యశోధక్ సమాజ్ 152వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ప్రభంజనం మాట్లాడుతూ 1872వ సంవత్సరంలో సావిత్రిబాయి పూలే-జ్యోతిబాపూలే సత్యశోధక్ సమాజ్ స్థాపించారని తెలిపారు. సమాజంలో అసమాన తలను రూపుమాపడానికి సత్యశోధకు సమాజ్‌ని నెలకొల్పారని తెలిపారు. ప్రజలందరూ సమానత్వం కోసం పోరాడాలని తెలిపారు. విద్యార్థులు ఐక్యమత్యంగా ఉండాలని తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే-జ్యోతిబాపూలే కాబట్టి ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కుల వివక్ష, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రజలు విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.