సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నూతనంగా స్థాపించిన శివమ్ మీడియా సంస్థ నుంచి గురువారం ‘సత్య’ చిత్ర టీజర్, సాంగ్ లాంచ్ చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ, ‘సత్య సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నా మొదటి సినిమా. మొదటి హీరో, మొదటి హీరోయిన్, మొదటి ప్రొడ్యూసర్.. నా అనుభవం నుండి తీసిన కథ ఇది’ అని అన్నారు. ‘నిర్మాతగా శివ మొదటి సినిమానే సత్య లాంటి పేరుతో మొదలు పెట్టారు. పెద్ద పెద్ద విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని నిర్మాత కె బాబు రెడ్డి చెప్పారు. మరో నిర్మాత సతీష్ మాట్లాడుతూ, ‘తెలుగువాడిని అయిన నేను చెన్నైలో స్థిరపడ్డాను. శివకి ఈ సినిమా చూపించాను. వెంటనే నేను తెలుగులో రిలీజ్ చేస్తాను అని చెప్పారు. ‘నాన్న’ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, లోకేష్ కనగరాజ్ నగరంలో, ప్రియదర్శి దర్శకత్వంలో అమరేష్ సినిమాలు చేశాడు. గోపురం ప్రొడక్షన్స్‌లో ‘రంగోలి’ పేరుతో ఈ సినిమాని స్టార్ట్ చేశాం. పెద్ద సక్సెస్ అయ్యింది’ అని తెలిపారు. ప్రొడ్యూసర్ శివ మల్లాల సతీమణి సుజాత మాట్లాడుతూ,’శివకి మంచి సక్సెస్ రావాలని, సత్య టీమ్‌కి అల్ ది బెస్ట్’ అని చెప్పారు. శివమ్ మీడియా అధినేత శివ మల్లాల మాట్లాడుతూ,’ఈసినిమా కొసం అన్ని అవే కలిసొచ్చాయి.. నాన్న అంటే ఎవరికీ ఇష్టం ఉండదు.. నాకు నాన్న లేరు, అందుకని నాకు అయన విలువ బాగా తెలుసు. అందరు పిల్లలు నాన్న మనకి ఏం ఇచ్చారు అనుకుంటారు, కానీ ఈ సినిమాలో హీరో సత్య మాత్రం నేను నాన్నకి ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే ఏమన్నా చెయ్యగలను అని తన జర్నీని స్టార్ట్ చేశారు’ అని తెలిపారు. సీనియర్ రిపోర్టర్ ప్రభు మాట్లాడుతూ, ‘శివ జర్నీ ఒక్కసారి చూస్తే. రీల్ కెమెరా వచ్చినప్పటి నుండీ ఇప్పుడు డిజిటల్ ఎరా వరుకు.. ఎప్పుడు కష్టపడుతునే ఉంటాడు.. తన మార్క్‌ని చూపించడానికి పరిగెడుతునే ఉంటాడు. హార్డ్ వర్క్‌ని నమ్ముకుని రిలేషన్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళే వ్యక్తికి సక్సెస్ కచ్చితంగా వస్తుంది’ అని అన్నారు.
తండ్రీ కొడుకుల అనుబంధంతో సత్య
10:52 pm