కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ, స్క్రీన్ ప్లే అందించారు.
క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. శుక్రవారం బాలకష్ణ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాలకష్ణ మాట్లాడుతూ, ”సత్యభామ’ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. పారిజాతపహరణం సమయంలో శ్రీకష్ణుడి వెంట ఉన్నది సత్యభామ. ఆమె వెంట ఉంటే విజయం ఖాయం. సత్యభామ అనే పేరు ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కు ప్రతీకగా చెప్పుకోవాలి. ఆర్టిస్టులు వైవిధ్యమైన చిత్రాలు చేయాలి. కాజల్ సత్యభామతో ఆ ప్రయత్నం చేసింది. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. పాత్రల ఆత్మలోకి వెళ్లి మెప్పించగలదు. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. జూన్ 7న థియేటర్స్‌లో చూడండి’ అని చెప్పారు. ‘బాలకష్ణ అభిమానిగా ఆ గుంపులో ఉండాల్సిన వాడిని. ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. ఆయన రావడంతో రిలీజ్ కు ముందే సక్సెస్ అందుకున్నంత హ్యాపీగా ఉంది. కాజల్ అగర్వాల్ మా సినిమా షూటింగ్ టైమ్‌లో చూపించిన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్’ అని నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి చెప్పారు.
‘సత్యభామ’ కథను శశి తన టీమ్‌తో వచ్చి చెప్పారు. నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. వెంటనే ఓకే చెప్పాను. ఈ కథ మీద ఉన్న నమ్మకం గ్లింప్స్ చూసినప్పుడు రెట్టింపు అయ్యింది. నా కోస్టార్ నవీన్ చంద్రకు థ్యాంక్స్ చెబుతున్నా. అమర్‌గా నవీన్ చంద్ర కంటే మరొకరు బాగా నటించలేరేమో. ప్రకాష్ రాజ్‌తో మరోసారి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. శశి వల్లే నేను సత్యభామగా మారాను. తెలుగు ఆడియెన్స్ నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు. మీ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా తప్పకుండా అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాను.
– హీరోయిన్ కాజల్