వాస్తవ ఘటన స్ఫూర్తితో సత్యభామ

వాస్తవ ఘటన స్ఫూర్తితో సత్యభామకాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. నవీన్‌ చంద్ర అమరేందర్‌ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్‌’ చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ, స్క్రీన్‌ ప్లే అందించారు. దర్శకుడు సుమన్‌ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి మంళవారం మీడియాతో మాట్లాడుతూ, ‘గూఢచారి, మేజర్‌ సినిమాల దర్శకుడు శశికిరణ్‌ తిక్కకి బాబీ తిక్క బ్రదర్‌. ఆయన ఇండిస్టీలో ఉన్నారనే మేం ప్రొడక్షన్‌లోకి వచ్చాం. అవురమ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మించాం. మా దర్శకుడు సుమన్‌కు ఇది మొదటి సినిమా. మ్యూజిక్‌ బ్యాండ్స్‌లో పాడే సింగర్స్‌ను ఐడెంటిఫై చేసి వారికి రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చాం. మేం ఫస్ట్‌ టైమ్‌ ఈ కథ విన్నప్పుడు మాలో ఎలాంటి ఎగ్జైట్‌మెంట్‌ కలిగిందో కాజల్‌ కూడా అలాగే ఫీలయ్యారు. నవీన్‌ చంద్ర ఒక మంచి ఇంపార్టెంట్‌ రోల్‌ చేశారు. ఒక ఇరవై ఏళ్ల క్రితం యూకేలో జరిగిన ఓ రియల్‌ ఇన్సిడెంట్‌ బేస్‌గా చేసుకుని ఈ సినిమా లైన్‌ రెడీ చేశాం. మైత్రీ మూవీ మేకర్స్‌ నైజాం ఏరియాలో మా సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రిలీజ్‌ చేస్తోంది. సెన్సార్‌ బందంలో మహిళలు మా మూవీని బాగా అభినందించారు. షీ సేఫ్‌ యాప్‌ కేవలం 5 వేల మంది మాత్రమే డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ఇంకా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మా సినిమాలో ఈ యాప్‌ ప్రస్తావన ఉంటుంది. షీ సేఫ్‌ యాప్‌కు పనిచేసే మహిళల్ని వారి ఫ్యామిలీతో సహా మా మూవీ స్పెషల్‌ షోకు ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పారు.