చంద్ర బాబు కు మద్దతుగా సత్యమేవ జయతే

నవతెలంగాణ – అశ్వారావుపేట:
రాజమండ్రి జైల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తో రాజమండ్రి జైలు లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడిని బంధించడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నియోజక వర్గం ఇంచార్జి కట్రం స్వామి దొర నేతృత్వంలో సోమవారం  “సత్యమేవ జయతే” నినాదంతో  నిరాహార దీక్ష నిర్వహించారు. స్థానిక మూడు రోడ్ల కూడలిలో గల నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో   పేరాయిగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి, అశ్వారావుపేట మండల అధ్యక్షులు నార్లపాటి శ్రీను, రాష్ట్ర ఎస్.సి సెల్ మహిళ కార్యదర్శి రమాదేవి,ఐ.టి.డి.పి రాష్ట్ర కార్యదర్శి అహ్మద్ పాషా, పేరాయిగూడెం గ్రామశాఖ అధ్యక్షులు  మర్రా రాకేష్, గుడం కిషోర్ , ఉప్పల బ్రహ్మంద్ర రావు , కాసాని పద్మ శేఖర్, పోట్రు జగదీష్ , పల్లసిల రామకృష్ణ ,షేక్. మదర్స్ ,బొట్టుపాటి ఉదయ్, మేకా బాబూరావు, కుంజ బుజ్జి బాబు,  నవీన్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.