తహసిల్దారుగా సత్యనారాయణ పదవి బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ – ఆర్మూర్   

నూతన తహసిల్దారుగా సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఇంతకుముందు తహసిల్దారుగా  విధులు నిర్వర్తించిన గజానన్ బదిలీ అయ్యారు. మోర్తాడ్ ఎమ్మార్వోగా విధులు నిర్వర్తించిన సత్యనారాయణ ఆర్మూర్ తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజలకు సంపూర్ణంగా సేవలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.