తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాదిపతి గా డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డిని నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రసిద్ధి చెందిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూ ఢిల్లీ నుండి పీహెచ్డీ కొరకు మధుమేహం వ్యాధి నివారణ పై జరిపిన పరిశోధనలు గుర్తించదగినవని పేర్కొన్నారు. పీహెచ్డీ అనంతరం అమెరికాలోని ప్రఖ్యాత రడ్ గర్స్ యూనివర్సిటీ లో క్యాన్సర్ వ్యాధి నివారణకు జరిగిన పరిశోధన ఫలాలుగా పది అంతర్జాతీయ పేటెంట్లు సొంతం చేసుకోవడం యూనివర్సిటీ కి గర్వకారణమని తెలిపారు. ఈ పరిశోధనల అనుభవాన్ని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు అందించి యూనివర్సిటీ ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని సూచించారు.ప్రస్తుతం యూనివర్సిటీ కళాశాలకు వైస్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గతంలో అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా, పబ్లికేషన్ సెల్ మరియు ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ లకు డైరెక్టర్ గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో విభాగాధిపతిగా నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావుకు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ నియామకాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు సైన్స్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ ఆరతి, డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ బోయపాటి శిరీష, అకాడమిక్ కన్సల్టెంట్లు తదితరులు అభినందించారు.