మండలంలోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి విధులు నిర్వర్తిస్తున్న చింత సత్యనారాయణ బెస్ట్ సూపర్వైజర్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని బెస్ట్ సూపర్వైజర్ అవార్డును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ అందజేశారు. తనను వరించడం పట్ల సత్యనారాయణ ఆనందం వెలుగుచ్చారు. విధి నిర్వహణలో తన సేవలను గుర్తించి అవార్డు అందించిన అధికారులకు, అవార్డు కోసం ఎంపికకు కృషి చేసిన ఆర్మూర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రమేష్ కు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.