ఐద్వా మండల అద్యక్ష కార్యదర్శులుగా సత్యవతి, నిర్మల లు ఎన్నిక

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఐద్వా అశ్వారావుపేట మండల అధ్యక్ష కార్యదర్శులు గా మడకం సత్యవతి,తగరం నిర్మల లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అశ్వారావుపేట 4 వ మండల మహా సభ మండలంలోని  నందిపాడు(మల్లు స్వరాజ్యం నగర్) లో గురువారం మడకం సత్యవతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహా సభకు ముఖ్య అతిధిగా హాజరైన సంఘం జిల్లా కార్యదర్శి మందలపు జ్యోతి పర్యవేక్షణలో నూతన మండల కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకున్నది. ఇందులో ఉపాధ్యక్షులు గా మనుగొండ సత్యవతి, సహాయ కార్యదర్శులు గా మొడియం తిరుపతమ్మ, పట్టెల మంగ, సభ్యులు గా మడకం వెంకమ్మ, సారిన కాంతమ్మ, సరియం బూదేవమ్మ, ఎట్టి కుమారి, మడకం వెంకమ్మ,మెచ్చు రాములమ్మ, వాసం తిరుపతమ్మ, సోడెం రమాదేవి, బడిపాటి సరస్వతి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.