నవతెలంగాణ – అశ్వారావుపేట
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం పట్టణంలో సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అనే కనినాదంతో శాంతి నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక శ్రీశ్రీ కళ్యాణ మండపం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగింది. ఈ సందర్భంగా వీహెచ్పీ,ఆర్ఎస్ఎస్ మండల బాధ్యులు కలకోటి వెంకటేశ్వరరావు,అప్పారావు లు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేస్తూ వారికి నరకం చూపిస్తున్నారని, మారణహోమం సుష్టిస్తూ హిందువుల ఇళ్ళపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను ఖండించి అక్కడి హిందువులను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి,భాజపా అద్యక్షులు బండారు చంద్రశేఖర్, జల్లిపల్లి అరవింద్ లు పాల్గొన్నారు.