ప్రాణాలను కాపాడుకోవాలి..

– రూట్ ఆపరేషన్ మేనేజర్ నీరజ్ దేశ్ పాండే..
నవతెలంగాణ – డిచ్ పల్లి
అతివేగం, మద్యం, రాంగ్ రూట్, ములమలుపుల వద్ద జాగ్రత్తగా ఉంటు వాహనాలు నడపి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అత్హంగ్ డిచ్ పల్లి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ రూట్ ఆపరేషన్ మేనేజర్ నీరజ్ దేశ్ పాండే అన్నారు.బుదవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో సేఫ్టీ అవర్ నేస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదరుడు తమ ప్రాణాలను కాపాడుకుంటూ ఉండే విధంగా వాహనాలను నడిపే నడపాలని మద్యం సేవించి, అతివేగంతో మూల మలుపుల వద్ద, హెల్మెట్ సీటు బెల్టులు ధరించకుండా వెళ్లి లేని ప్రమాదాలను కొని తెచ్చుకొని కుటుంబాలకు జీవితాంతం కష్టాల్లో నెట్ట వద్దని పేర్కొన్నారు. జాతీయ రహదారి వద్ద ఉన్న టోల్ ప్లాజా ఆధ్వర్యంలో వాహనదారులకు అందజేసే సహాయ సహకారాలను వివరించారు. రాంగ్ రూట్లో వెళ్లి తమ్ముడు ఇబ్బందులు పడి ఇతరులకు ఇబ్బందులకు గురి చేయవద్దని ఎంతోపాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సేఫ్టీ అధికారి పి సతీష్, మేనేజర్ వీరబాబు, టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు.