నా బిడ్డను కాపాడండి..ఓ తల్లి ఆవేదన..

Save my child..O mother's agony..– దాతల సహాయం కోసం నిరీక్షణ..
నవతెలంగాణ – వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్ – శ్యామల దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు వీరిలో చిన్న కూతురు నయనశ్రీ 6 సం లు రెండవ తరగతి చదువుతుంది. అనూహ్యంగా గత 2 నెలల క్రితం ఎడమ చెంప భాగం లో చిన్న గడ్డ ఏర్పడింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినా తక్కువ కాకపోవడంతో హైదరబాద్ వైద్య పరీక్షలు చేయించారు.వైద్యులు పరీక్షల అనంతరం క్యాన్సర్ గడ్డగా నిర్ధారణ చేశారు. దొరికాడ అప్పులు తెచ్చి రెండు నెలల్లో 3 లక్షల రూపాయలు వరకూ ఖర్చు చేసారు. అయినప్పటికీ నయం కాలేదు డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఇంకా మెరుగైన వైద్యం అందించాలంటే దాదాపు 10 లక్షల రూపాయలు వరకూ ఖర్చు అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట, తల్లి కూలి పనులకు వెళ్ళడం, కడు నిరుపేద పేదరికంతో, ఓక వైపు బిడ్డను కాపాడుకోవాలని, చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతూ దాతల కోసం ఎదురు చూస్తూ తల్లి రోదిస్తున్నారు. దాతలు, దయ హృదయులు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని, ప్రభుత్వ అధికారులు,ప్రభుత్వం ఆదుకొని నా బిడ్డను కాపాడాలని ఆ తల్లి వేడుకుంటుంది .