కువైట్ దేశంలో చిక్కుకున్న నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ ను స్వదేశానికి తిరిగి తెచ్చే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ అధికారి అమిత్ కుమార్ ను హైదరాబాద్ లో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, టీఎస్ఎండీసీ ఛైర్మన్ ఇరవత్రి అనిల్ ఆధ్వర్యంలో సోమవారం బాధితుడు కుటుంబ సభ్యులు కలిశారు. క్లీనింగ్ అని చెప్పి ఏజెంట్ మాయమాటలు చెప్పి, కువైట్ దేశానికి పంపించడంతో అక్కడ ఎడారిలో ఒంటెలు మేపుతూ.. నాభర్త నానా ఇబ్బందులపాలవుతున్నాడని ఆమె వాపోయారు. తక్షణం స్పందిచి నాందేవ్ ను స్వదేశానికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీం రెడ్డి, తెలంగాణ జనసమితి ముధోల్ నియోజక వర్గ ఇంచార్జి సర్ధార్ వినోద్ కుమార్, నాందేవ్ భార్య రాథోడ్ లక్ష్మి, కుమారుడు శ్రీకాంత్, నాయకులు నరహరి గౌడ్, నరేందర్, రంజిత్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.