– రాష్ట్ర ఐఎంఏ నాయకులు డాక్టర్ పుల్లారావు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రక్షించే వారిని రక్షించండి (సేవ్ ద సేవియర్స్), ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని, రాష్ట్ర ఐఎంఏ నాయకులు డాక్టర్ పుల్లారావు డిమాండ్ చేశారు. ట్రైన్ డాక్టర్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ఓపీలను నిలిపివేశారు. ఐఎంఏ నీలగిరి బ్రాంచ్, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్,మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్, జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్, ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పటల్ మెడికల్ కళాశాల నుండి బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్ కు చేరి అక్కడ రాస్తారోకో చేశారు. అనంతరం ఐఎంఏ భవనంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైద్యులకు కావలసిన రక్షణను ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రిని సేఫ్ జోన్ గ తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సెంట్రల్ యాక్ట్ తీసుకువచ్చి దోషులను శిక్షించాలని, అప్పుడే ఇలాంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ దైవాధీనం, డాక్టర్ వెంకట్ రెడ్డి,డాక్టర్ పద్మ, డాక్టర్ శ్రీకాంత్ వర్మ, డాక్టర్ రమేష్, డాక్టర్ సమద్, డాక్టర్ నగేష్, డాక్టర్ విజయ్, డాక్టర్ అనిల్, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ లీలావతి,డాక్టర్ విశ్వ జ్యోతి, నరేష్ డాక్టర్, డాక్టర్ హర్షిత, డాక్టర్ శ్రీజ, డాక్టర్ అశ్లేషవల్లి, డాక్టర్ దత్త నరేష్ గగన్ తదితరులు పాల్గొన్నారు.