నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రతి వ్యక్తి పొదుపు అలవాటు చేసుకోవడం ఎంతో మంచిది అని ప్రగతి సేవా సమతి మండల కోఆర్డినేటర్ చెడుపాక వెంకన్న అన్నాడు. మండల కేంద్రంలోని ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి పొదుపు అలవాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి అన్నారు. ,దీని తో పాటు ప్రతి వ్యక్తి సిబిల్ ,స్కోరు, పెంచుకుంటే ఎంతో లాభసాటిగా ఉంటుందని అన్నారు, అంతేకాకుండా దీంతో ప్రయోజనం ,ప్రభుత్వ పథకాలు, స్కీములు, పొందవచ్చు అని అన్నాడు. కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రగతి కార్యకర్తలు రామావతార పద్మ, ఇందిరా, కవిత, రేణుక, వీరాస్వామి, రమేష్ , ఆశోకు రాథిక, సంద్య, తదితరులు పాల్గొన్నారు.