– 6.9 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లింపు
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : రాజీకి అర్హమైన కేసులను కక్షిదారులు పరిష్కరించుకొని, తమ విలువైన సమయాన్ని, డబ్బును ఆదాచేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు సూచించారు. శనివారం నల్లగొండ జిల్లాలోని ఆయా కోర్టుల పరిదులలో మొదటి జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ ను నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ప్రారంభించి మాట్లాడారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల ప్రాంగణములలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తునట్లు తెలిపారు.లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా ఈ జాతీయ లోక్ అదాలత్ లో, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 123 సివిల్ కేసులు, 4991 క్రిమినల్ కేసులు, 1,24,165 ప్రిలిటిగేషన్ కేసులను, మొత్తం 129279 కేసులు పరిష్కారం కాగా రూ.6,09,31,576 బాధితులకు నష్టపరిహారంగా అందచేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి. దీప్తి మొదటి అదనపు జిల్లా జడ్జి బి.తిరుపతి, జి.సంపూర్ణ ఆనంద్, రెండొవ అదనపు జిల్లా జడ్జి, డి .దుర్గ ప్రసాద్,మూడవ అదనపు జిల్లా జడ్జి, కే.కవిత, నాల్గోవ అదనపు జిల్లా జడ్జి, మేజిస్ట్రేట్స్, న్యాయవాద సంఘం అధ్యక్షులు నేతి రఘుపతి, రవి కుమార్, కార్యదర్శి న్యాయ సేవాధికార సంస్థ నామినేటెడ్ సభ్యులు, ఇతర న్యాయవాదులు, పోలీసు యంత్రాంగం వివిధ శాఖల బ్యాంకు బియస్ఎన్ఎల్. సిబ్బంది పాల్గొన్నారు.