ఫోన్‌పే గేట్‌వేతో వ్యాపార సంస్థలకు ఆదా

న్యూఢిల్లీ : తమ పేమెంట్‌ గేట్‌ వే ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు రూ.8 లక్షల వరకు ఆదా చేసుకునే వీలు కల్పిస్తోన్నట్లు ఫోన్‌పే పేర్కొంది. చాలా వరకు పేమెంట్‌ గేట్‌ వేలు 2శాతంను ప్రామాణిక లావాదేవీ ఫీజుగా వసూలు చేస్తుండగా, ఫోన్‌పే పేమెంట్‌ గేట్‌ వే మాత్రం కొత్త వ్యాపారులకు ఆన్‌ బోర్డింగ్‌ను ఉచితంగా కల్పించే ఒక ప్రత్యేక ఆఫర్‌ కలిగి ఉందని తెలిపింది.. ఇందులో ఎలాంటి రహస్య ఛార్జీలు, సెటప్‌ ఫీజు లేదా వార్షిక నిర్వహణ ఫీజులు ఉండవని తెలిపింది. యుపిఐ మార్కెట్‌లో ఫోన్‌పే 50 శాతం పైగా మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నట్లు పేర్కొంది.