– ఓపెన్ ప్లాట్స్ బ్రోచర్ ఆవిష్కరణలో మైదం నాగేశ్వర్, వేణు
నవతెలంగాణ – రామగిరి
సావిర గ్రీన్ సిటీ అంటేనే ఒక బ్రాండ్ అని, ఓపెన్ ప్లాట్స్ బ్రోచర్ ఆవిష్కరణలో సావిర వెంచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మైదం నాగేశ్వర్, మైదం వేణు అన్నారు. రామగిరి మండలంలోని కలవచర్ల గ్రామ శివారులో సావిరా గ్రీన్ సిటీ పేరిట వెంచర్ ఏర్పాటు చేసి బ్రోచర్ ఆవిష్కరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. ఇంతకుముందు ఇక్కడ ఎన్నో వెంచర్స్ ఏర్పాటు చేశారని, మేము వాటి గురించి మాట్లాడమని, ఇక్కడ ముందుగానే కల్వచర్ల గ్రామపంచాయతీలో 3 వేల గజాలు మార్టిగేజ్ చేశామని, అలాగే ఇక్కడ వెహికల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా (ఆర్ ఈ ఆర్ ఏ) రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అగ్రిమెంటు మొదటిసారిగా ఈ ఏరియాలో ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు పెద్దపల్లి జిల్లాలో ఏ వెంచర్ కూడా ఇలా స్టార్ట్ చేయలేదని, మేము పెద్ద పెద్ద చదువులు చదువుకొని బెంగళూరు లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి పట్టణాలకు పల్లెలే పట్టుకొమ్మలని ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని వారన్నారు. అదేవిధంగా ఈ వెంచర్ లో ఎన్నో కొత్త కొత్త హంగులతో నాణ్యత ప్రమాణాలతో రోడ్లు డ్రైనేజీ విద్యుత్తు మొదలగు మౌలిక వసతులు కల్పిస్తున్నామని, అదేవిధంగా చెట్లు రెండు సంవత్సరాల వరకు పెంచే బాధ్యతను సావిర వెంచర్ తీసుకుంటుందని, వారు తెలిపారు. అలాగే డీటీసీపీ అప్రూవడ్ కూడా ఉందని అదేవిధంగా పిల్లలకు ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్, సీసీటీవీ పర్యవేక్షణ, మొత్తం వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ, అలాగే వెంచర్కు మెయిన్ గేటు, గేటుకు ఆర్చి, అన్ని ప్లాట్లకు నీటి సదుపాయం, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు సౌకర్యాలు కల్పిస్తున్నామని వారన్నారు. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు కానీ ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇక్కడ ప్లాట్లు తీసుకొని ఇల్లు నిర్మించుకొని ప్రశాంతమైన వాతావరణం కాలుష్యం లేకుండా ఉన్నటువంటి అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్ము నాగన్న, నితిన్, నిఖిల్, నీలం శ్రీనివాస్, గుండ శంకరయ్య, కుడిది వేణుగోపాల్, దొడ్డిపేట సారయ్య, తోట శంకర్, బచ్చలి నరేందర్, రవికాంత్, బత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.