
-మహిళ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
నవతెలంగాణ-బెజ్జంకి : అట్టడుగు వర్గాల మహిళలకు చదువుతో చైతన్య నింపాలనే సదుద్దేశ్యంతో సమసమాజ స్థాపనకు కృషి చేసిన సావిత్రి బాయి ఫూలే పోరాటం ఆదర్శనీయమని మానకొండూర్ నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడు శానగొండ శరత్ కొనియాడారు.సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహలకు యువజన కాంగ్రెస్ నాయకులు,సీపీఐ నాయకులు పూలమాలు వేసి నివాళులర్పించారు.అనంతరం బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాల,చీలాపూర్ ప్రాథమిక పాఠశాల మహిళ ఉపాధ్యాయులను యువజన కాంగ్రెస్,సీపీఐ,ఎమ్మార్ఫీఎస్ నాయకులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.