సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి

– జనవరి 12న పూలే పురస్కారాలు
– పూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలి 
– డిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నవతెలంగాణ కంటేశ్వర్
సావిత్రి బాయి పూలే 193 వ జయంతి సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని  ఐటిఐ ప్రాంగణం లో గల సావిత్రి బాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్  గొప్ప సంఘసంస్కర్త అయిన సావిత్రి బాయి పూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించాలని, పూలే దంపతులకు భారతరత్న అవార్డు ను ప్రకటించాలన్నారు.
                  సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర ను పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశం గా చేర్చాలన్నారు. ఆమె పేరిట ఏర్పాటు చేసిన బిసిటియు సావిత్రి బాయి పూలే పురస్కారాల కార్యక్రమం 9వ వార్షికోత్సవం ను ఈ నెల 12 వ తేదీ న న్యూ అంబేద్కర్ భవనం లో నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ జిల్లా ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి నర్సయ్య, గౌరవ సలహాదారులు డి. విజయ్ కుమార్, సుదర్శన్, డిచ్ పల్లి మండలం బిసిటియు అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.