
నవతెలంగాణ – బెజ్జంకి
మహిళల అభ్యున్నతితో పాటు సమాజంలో తలెత్తిన అసమానతలను రూపు మాపడానికి సావిత్రి బాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని బీఎస్పీ,స్వేరోస్ నాయకులు కోనియాడారు. అదివారం మండల కేంద్రంలోని ఫూలే దంపతుల విగ్రహల చౌరస్తా వద్ద బీఎస్పీ,స్వేరోస్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వేరోస్ నెట్ వర్క్ జిల్లాధ్యక్షుడు ఉప్పులేటి బాబు,బీఎస్పీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దొల్ల శ్రీనివాస్ యాదవ్,బుర్ర సంతోశ్,కవ్వంపల్లి జీవన్,బోనగరి జాన్,ఓరుగంటి రత్నం,వెంకటేశ్, పవన్,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.