మహిళలకు సావిత్రిబాయి ఆదర్శం

– సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జాజాల రుద్ర కుమార్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
నేటి మహిళలందరూ సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ముందుకు సాగాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జాజాల రుద్ర కుమార్‌ అన్నారు. ఆదివారం కాటేదాన్‌లో క్లస్టర్‌ కోశాధి కారి భాస్కర్‌ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్థంతి కార్యక్రమంలో రుద్రకుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆయన గుర్తు చేశారు. ఆ కాలంలోనే బడుగు, బలహీన వర్గాలు, పేద స్త్రీలను లక్ష్యంగా చేసుకొని వారికి విద్యను అందించడానికి విశేషకృషి చేసిన గొప్ప మహిళా సావిత్రిబాయి పూలే అని ఆయన స్పష్టం చేశారు. సావిత్రి బాయి పూలే జీవిత చరిత్రను భావితరాలకు అందించ వలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాజేంద్రనగర్‌ మండల నాయకులు ప్రవీణ్‌ కుమార్‌, సచిన్‌, వెంకటేష్‌ గౌడ్‌, దత్తు, శశికాంత్‌, జాం గిర్‌, నరేందర్‌, రాజేష్‌, వెంకట్‌రావు, ఎండీ మహమూద్‌ తదితరులు పాల్గొన్నారు.