సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సావిత్రిభాయి జయంతి వేడుకలు

నవతెలంగాణ -దుబ్బాక  : తొలి మహిళా ఉపాధ్యాయురాలు,సాంఘిక సేవకురాలు సావిత్రిభాయి పూలే 193 వ జయంతి సందర్భంగా శుక్రవారం దుబ్బాక పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.భాస్కర్ మాట్లాడుతూ… కుల దురహంకార, మనువాదుల కట్టుబాట్లను ఎదిరిస్తూ ప్రతి ఒక్కరికి విద్యను నేర్పించాలని సంకల్పించిన తొలి ఉద్యమకారిణి, మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) దుబ్బాక పట్టణ,మండల కార్యదర్శులు కొంపల్లి భాస్కర్,సింగిరెడ్డి నవీన,నాయకులు సాజీద్,బత్తుల రాజు,లక్ష్మీనరసయ్య,మహేష్ పాల్గొన్నారు.