సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రీబాయి ఫూలే జయంతి ఉత్సవాలనీ ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా కళాశాలలో పనిచేస్తున్న మహిళ అధ్యాపకులని ప్రిన్సిపల్ చేతుల మీదుగా ఘనంగా శాలువాలు కప్పి సత్కరించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ సి.హెచ్. శరత్ కుమార్ మాట్లాడుతూ బారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని కొనియాడారు.అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని ఆర్పించారని అన్నారు. ఈ సమావేశంలో ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ వి. అంజయ్య, అధ్యాపకులు ఆర్.శేఖర్, వి.జయ భారత్ రెడ్డి, ముత్యాల మహేందర్ రెడ్డి, ఎస్. దేవయ్య, జి.అశోక్, యు.రవీందర్, ఎన్.గోపి, ఇ.మహేందర్, ఎస్.సంతోష్, వి.శ్రీనివాస రావు, లత, మంగమ్మ, అరుణ, స్వప్న, జ్యోతి, దీపిక, అధ్యాపకేతర సిబ్బంది ఉన్నారు.